ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెంకీ మామ..!

ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెంకీ మామ..!

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘వెంకీ మామా’ , ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 21 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.హైదరాబాదులో జరగబోయే ఫస్ట్ షెడ్యూల్ లో నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొననున్నారు.

ఇక వెంకటేష్ కు జోడిగా హ్యూమ ఖురేషీ నటించనుంది,కె.యస్ రవీంద్ర బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. కోన వెంకట్ రచన సహకారం అందిస్తుండగా దేవిశ్రీప్రసాద్ బాణీలు సమకూరుస్తున్నారు.కోన ఫిలిం కార్పొరేషన్, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరులో విడుదల కానుంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: