పవర్ స్టార్ అభిమానులకి షాక్ ఇచ్చిన అకీరా నందన్…!

ప్రస్తుతం గడిచిన పదేళ్ళ నుండి టాలీవుడ్ లోని స్టార్ హీరోలా వారసత్వ ఎంట్రీ మొదలైంది. మొదటగా మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ తెరంగేట్రం చేసి తనకంటూ సొంత అభిమానులను సంపాదించుకున్నారు .ఆ తర్వాత అక్కినేని మూడో వారసుడిగా నాగ చైతన్య తెలుగు తెరకు పరిచయం అయి సక్సెస్ అయ్యారు. గడిచిన ఐదేళ్ల నుంచి నందమూరి బాలకృష్ణ గారి కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా ఆత్రుత తో చూస్తున్నారు అభిమానులు, కాగా ఆ గ్యాప్ లో అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో వారసుడు అఖిల్ చాలా ఘనంగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇప్పటికే మూడు సినిమాలతో పర్వాలేదనిపించుకున్నారు, ఆ సినిమాల ఫలితం ఎలా ఉన్నా అందంలో గానీ నటనలో గానీ ఏమాత్రం మైనస్ కాదని చెప్పొచ్చు. ఇక ఈ సంవత్సరం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని సినీ వర్గాలు చెప్తున్నాయి.

ఇదంతా ఇప్పుడెందుకంటే ఇటీవలే రేణుదేశాయి అకీరా నందన్ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, ఆ పిక్స్ మెగా ఫ్యామిలీని బాగా ఆకట్టుకుంటున్నాయి ఆరడుగుల పైనే ఎత్తున్న అకీరా నందన్ పవన్ కళ్యాణ్ మాదిరిగానే స్టార్ హీరోగా ఎదగడం ఖాయం అనిపిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది మెగా ఫ్యామిలీకే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు, ఒక వేళ అకీరా నందన్ గనుక రానున్న రోజుల్లో త్వరగా ఎంట్రీ ఇస్తే మెగా అభిమానులు ఖచ్చితంగా ఆదరిస్తారనిపిస్తుంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: