ఈసారైనా హిట్ కొట్టేనా?

అక్కినేని మూడో తరం రెండో వారసుడు అఖిల్ మొదటి సినిమా నుండి మొన్నోచ్చిన మిస్టర్ మజ్ను వరకు చేసిన మూడు సినిమాలే అయిన సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. తెరంగేట్రం భారీ స్థాయిలో జరిగిన మొదటి చిత్రం తోనే ఘోరపరాజయాన్ని చవి చూసారు, ఆ తర్వాత వచ్చిన హలో సినిమాతో పర్వాలేదనిపించుకున్న గత వారం విడుదలైన మిస్టర్ మజ్ను సినిమా పై అటు అక్కినేని అభిమానుల్లో ఇటు సగటు ప్రేక్షకులు సైతం ఈసారి సాలిడ్ హిట్ పడుతుందని అనుకున్నారు కానీ అది కూడా యావరేజ్ గా నిలిచింది, అయితే ఈ మూడు సినిమాలకి అఖిల్ ఏమాత్రం మైనస్ కాదని ప్రేక్షకులు సమీక్ష రూపంలో చెప్పేశారు.

ఇప్పుడు అఖిల్ ఆశలన్నీ తన తదుపరి చిత్రం పైనే అని చెప్పొచ్చు, ఈ నాల్గవ చిత్రానికి ప్రముఖ దర్శకులు శ్రీను వైట్ల గారి పేరు వినబడుతుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. గతంలో నాగార్జున శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన కింగ్ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి వరుస పరాజయాలతో ఉన్న శ్రీను వైట్ల కూడా ఈ సారి వీళ్ళిద్దరూ హిట్ అందుకునేలా సినిమా తీస్తారేమో చూడాలి.ఇక శ్రీనువైట్ల గారి పేరు కన్న ముందు నుంచే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారి పేరు లిస్ట్ లో ఉంది, కానీ బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది కాబట్టి ఆ అవకాశం లేదనే చెప్పాలి.ఏదేమైనా ఏ దర్శకులు వచ్చిన ప్రస్తుతం అఖిల్ కి మాత్రం భారీ హిట్ సినిమా చాలా అవసరం.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.