అంచనాలను పెంచిన దేవ్ ట్రైలర్…!

తమిళ స్టార్ హీరో కార్తీ,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రెండో సారి వస్తున్న సినిమా ‘దేవ్’. గత నెలలో విడుదలైన టీజర్ ఈ సినిమా పై బజ్ క్రియేట్ చేసింది, ఇక ఇటీవలే విడుదలైన పాటలు ఒక స్థాయిలో ఆకట్టుకున్నాయి. ఈ రోజు విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అటు తమిళంలోనూ ఇటు తెలుగులోను తెగ ఆకట్టుకుంటుంది, టీజర్ తో ఆకట్టుకున్న ఈ ట్రైలర్ తో అంచనాలను రెట్టింపు చేసింది.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ పై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఆద్యంతం సరికొత్తగా కనిపిస్తూ ఎమోషన్ల్ గా ఈ సినిమా ఉండనుందని తెలిసింది,అలాగే కార్తీ,రకుల్ ప్రీత్ సింగ్ కెమిస్ట్రీ మరో సారి అదిరిపోయే రేంజ్లో కనబడుతుంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవం కానుకగా తమిళంలో , తెలుగులో ఒకేరోజు విడుదల కానున్నాయి,హారిష్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: