చెమట చుక్కల చదువులు నాయి।। కాయా కష్టం పాఠాలు। ।

”అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగాక గుర్తించాలిసిన అవసరం లేదు” అని ఖలేజా సినిమాలోని మాట గుర్తుండే ఉంటాది. ఈ ఒక్క మాట మనకి చాలా సందర్భాల్లో అవసరం,కానీ ఇది సందర్భం కాదు సంచలనం.సోషల్ మీడియా గురించి ఇప్పటికి చాల మంది మేధావుల దృష్టిలో నెగటివ్ ఫీలింగ్ యే ఉంది,కరెక్టే దాన్ని ఎలా వినియోగించుకుంటే ఫలితం అలా ఉంటుంది అన్నది వాస్తవం. ఇప్పటి వరకు సోషల్ మీడియాని నమ్ముకొని తమ తమ టాలెంట్ తో ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయినా వాళ్ళ లిస్ట్ చాల పెద్దది చెప్పడం కష్టమే.

ప్రస్తుతానికి పలాస బేబీ గారితో సరిపెట్టుకుందాం.బేబీ గారు పాడిన పాటతో మరో సారి సోషల్ మీడియా పవర్ ఏంటో రుజువైంది।తూర్పుగోదావరి జిల్లా వడిసెలేరు అనే గ్రామం లో మొదలయింది ఈ కథ।అప్పటి వరకు తన పని తాను చేస్కుంటూ తన కి నచ్చిన పాటలు పాడుకుంటూ ఉన్నదాంట్లో సంతోషంగా బ్రతుకుతున్న బేబీ గారికి ఆ ఊరికి కొత్తగా వచ్చిన రాణి అనే సింగర్ పరిచయం అయ్యారు।

ఆ పరిచయం బాగా దగ్గరైయ్యాక,ఒక రోజు గంజి కోసం అని బేబీ గారు రాణి గారి ఇంటికెళ్లారు, పాటలంటే పిచ్చి ప్రేమ ఉన్న రాణికి బేబీ గారి గొంతు నుండి ఓ సినిమా పాట వినాలనిపించిందంట ఆ తరుణం లో బేబీ గారు ఏ।ఆర్ రెహమాన్ గారు సంగీతం అందించిన ప్రేమికుడు సినిమాలోని ”ఓ చెలియా నా ప్రియసఖియా” అనే పాటను పాడారు।పాడుతున్న పాటని వినకుండా దాన్ని తన మొబైల్ లో ఆ వీడియోని చిత్రీకరించారు రాణి,అక్కడితో ఆగకుండా తనకు తెలిసిన ఒక సింగర్ వీరబాబు అనే వ్యక్తికి వాట్సాప్ లో షేర్ చేసారు।ఇప్పుడిక్కడ ఆ వీరబాబు అనే వ్యక్తి కి మనం హ్యాట్సఫ్ చెప్పాలిసిందే,వాట్సాప్ లో వచ్చిన వీడియోని చూసి అందులోని విషయాన్నీ గుర్తించి ఊరికే వదిలేయకుండా ఎక్కడో ఒక చిన్న ఆశతో దాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు।అక్టోబర్ 29,2018 న ఈ వీడియో పోస్ట్ అవ్వడం,ఆ వెంటనే అది వైరల్ అవ్వడం అంత రాత్రికి రాత్రే జరిగిపోయింది।

ప్రముఖ గాయకులు మరియు సంగీత దర్శకులు రఘు కుంచెని ఈ బేబీ గారి పాట అందరిని ఆకర్షించినట్లు తెగ ఆకట్టుకుంది,తాను కూడా ఈ వీడియోని తన ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తూ ప్రశంసలు కురిపించారు।ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే బేబీ గారికి తను పాడిన ఈ పాట సోషల్ మీడియా లో సంచలం సృష్టిస్తుంది అని తెలియదట, తన కూతురి డెలివరీ టైం కాబట్టి తన పని లో తను హాస్పిటల్ లో బిజీగా ఉంది।ఈ సమయం లో రఘు కుంచె గారు బేబీ గారి కాంటాక్ట్ వివరాలు కనుక్కొని వివరంగా తనతో ఫోన్లో మాట్లాడితే గాని బేబీ గారికి ఈ విషయాలన్నీ తెలియలేదంట।

బేబీ గారితో మాట్లాడిన తక్షణమే రఘు గారు తన సంగీత దర్శకత్వంలో రాబోతున్న ”పలాస 1978”  సినిమాలో బేబీ గారు పాట పాడబోతున్నారని అధికారికంగా చెప్పారు. ముందు సినిమాలోని పాటతో పరిచయం చేద్దాం అనుకున్నారు,సినిమా పాట కాకుండా నిజ జీవితానికి దగ్గర్లో ఉన్నట్లు ఏదైనా పాటుంటే బావుంటుందని ఆలోచించి తన స్నేహితుడైన ప్రముఖ మాటల-పాటల రచయిత అయిన లక్ష్మీ భూపాల గారికి ఫోన్ చేసి విషయం చెప్పి పాట రాయమన్నారు,దానికి లక్ష్మీ భూపాల గారు ట్యూన్ పంపమన్నారట 15 నిమిషాల్లో రఘు గారు  ట్యూన్ పంపించారు,లక్ష్మీ భూపాల గారు 45 నిమిషాల్లో పాట రాసేశారు.ఆ పాట రెండు నెలల క్రితం రికార్డు చేసారు, వీడియో రూపంలో బయటకు తీసుకొచ్చే ఆలోచనల్లో ఉన్నట్లు రఘు గారు చెప్పారు,ఆ పాటను టీజర్ రూపంలో ఎడిట్ చేసి రిలీజ్ చేశారు, “మట్టి మనిషినండి నేను” అంటూ సాగే ఈ పాట నెటిజన్లను ఒక రేంజ్లో ఆకర్షించింది. బేబి గారి గొంతులోని తియ్యదనం,రఘు కుంచె గారి సంగీతం,లక్ష్మీ భూపాల గారి సాహిత్యం అన్ని చక్కగా కుదరటం ఎప్పుడెప్పుడు ఫుల్ సాంగ్ రిలీజ్ అయిద్దా అని అప్పటి వరకు సడన్ సింగర్ బేబీ గారు తెలిసిన వారు నిన్నటి వరకు ఎదురు చూశారు,నిన్న విడుదలైన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది.

ఈ గాన కోకిల బేబీ ప్రతిభకి ఆకర్షితులైన మరొకరిలో ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు ఉన్నారు, ఎంతలా అంటే తన పాట మాధుర్యానికి కంట తడిపెట్టుకున్నంత. ఒక్క కోటి గారు రఘు కుంచె గారే కాదు ఎస్.జానకమ్మ గారు కూడా తన ప్రశంసలతో ముంచెత్తారు.

గాన కోకిల బేబి గారు బయటి ప్రపంచానికి తెలిసింది ఏ.ఆర్ రెహమాన్ గారి పాట తోనే అయినప్పుడు అతని వైపు నుండి రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుంది??..ఆ వీడియో చూసి ఎవరో..అజ్ఞాతవాసి…స్వీట్ వాయిస్ అంటూ నవంబర్ 14 న తన ఫేస్బుక్లో షేర్ చేసారు, అంతేకాకుండా కోటి గారికి ఫోన్ చేసి బేబీ గారిని ఒక సారి చెన్నైలోని తన స్టూడియోకి తీసుకురమ్మన్నారట.ఇది ఎంత గొప్ప సక్సెస్ అంటే ఏ.ఆర్ రెహమాన్ గారి ఒక చిన్న ఇంటర్వ్యూ కానీ ఒక్కో టైంలో అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి, అలాంటిది ఏ.ఆర్ రెహమాన్ గారి నుంచే ఇలాంటి పిలుపు రావడం ఈ సడెన్ సింగర్ బేబీ గారికి తన జీవితంలో మంచి విజయం అని చెప్పొచ్చు.

ఇక మెగాస్టార్ చిరంజీవి గారు సైతం ఫిదా అవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది, చిరంజీవి గారు కోటి గారి ద్వారా బేబి గారిని ఇంటికి పిలిపించి తనదైన గౌరవాన్ని అందించారు.సహజ సిద్ధ సరస్వతీ పుత్రీక అని చిరంజీవి గారు బిరుదు ఇచ్చారు. ఆ క్షణంలో చిరంజీవి గారిని చూసిన బేబి గారు బాగా ఎమోషన్ల్ అయ్యారు,కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఆశీస్సులు తీసుకున్నారు.రుద్రవీణ, అభిలాష నుండి పాటలు పాడి మెప్పు పొందారు. యూట్యూబ్లోని ఈ వీడియోలు చేసినప్పుడు బేబీ గారి నిజమైన సక్సెన్ ను స్వయంగా మన కళ్ళతో చూసినట్లు అనిపిస్తుంది, అలాగే ఓవైపు ఈర్ష్య కలుగుతుంది. చిరంజీవి గారి సతీమణి సురేఖ గారు తన పాటకి పెద్ద అభిమాని అని చెప్పుకొచ్చారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు,ఆర్పీ పట్నాయక్ గారు మరికొందరు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖుల దగ్గర్నుంచి తన ప్రతిభకు సంబంధించి ప్రశంసలు అందుకున్నారు. ఇలా ఒక్క రెండు నిమిషాలు ఒక పాట పాడి ఎవరో సొంత అయిన వాళ్ళు కూడా కాకుండా తన ప్రతిభను గుర్తించి అయినంతవరకు ఎలాంటి స్వార్థం లేకుండా ఆమె విజయానికి కారకులైయ్యారు.

ముఖ్యంగా పలాస బేబీ గారి విజయానికి రఘు కుంచె గారు, కోటి గారే అని చెప్పొచ్చు.
అస్సలు చదువుకోలేదు, సినిమాల్లో పాటలు ఎలా పాడిస్తారో తెలీదు,తన ఊరు, ఇల్లు తప్ప బయట ప్రపంచం ఏంటో తెలీని బేబీ గారికి ఈ రకమైన విజయం దక్కడం నిజంగా గొప్ప విషయమే.ఎప్పుడో ఎక్కడో విన్న మాట “మన కోరికలు నిస్వార్థం అయిన్నపుడు మన విజయానికి ప్రకృతి సహకరిస్తుంది” అని..అది ఇలాంటి వారి విజయాలు చూసినప్పుడు అనిపిస్తుంది…!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: