మరోసారి దిల్ రాజు నిర్మాణంలో చైతు…!

అక్కినేని మూడో తరం వారసుడిని పరిచయం చేసింది శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ,దిల్ రాజు నిర్మాతగా కొత్త దర్శకుడు అయిన వాసువర్మ ని పరిచయం చేస్తూ పది సంవత్సరాల క్రితం నాగ చైతన్య ని ‘జోష్’ సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు.మంచి యూత్ ఫుల్ మెస్సెజ్ ఓరియేంటెడ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద సత్తా చూపించలేకపోయింది.కానీ చైతూ కెరీర్‌లో ఒక మైల్ స్టోన్ గా నిలిచింది అని మాత్రం చెప్పొచ్చు. నాగార్జున గారు కూడా చాలా సార్లు చైతూ సినిమాల్లో జోష్ సినిమానే తన ఫెవరేట్ అని చెప్పుకొచ్చారు, కానీ ఆ సినిమా ఫలితం విషయంలో నిరుత్సాహాం వ్యక్తం చేసారు.

ఇక మరోసారి దిల్ రాజు నిర్మాణంలో ‘శశి’ అనే మరో నూతన దర్శకుడ్ని పరిచయం చేస్తూ చైతూ హీరోగా ఓ సినిమాకి శ్రీకారం చుడుతున్నారు.ఈ సినిమా స్క్రిప్ట్ పట్ల చై కూడా బాగా ఎక్స్జైట్మెంట్ తో ఉన్నారట,త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాకి సంబంధించి మిగితా వివరాలు అఫీషియల్ గా తెలియనున్నాయి.
శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి పరాజయాలతో ఉన్న చైతు ప్రస్తుతం శివ నిర్వణ దర్శకత్వంలో ‘మజిలీ’ షూటింగ్లో బిజీగా ఉన్నారు, ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: