ఈ సినిమాతో ఇద్దరూ సక్సెస్ అందుకుంటారా..?

గోపిచంద్ కెరీర్‌లో ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ హిట్ సినిమాలేవి లేవు. గత ఏడాది ‘పంతం’ సినిమాతో పర్వాలేదనిపించుకున్న పూర్తి స్థాయిలో ఈ సినిమా విజయాన్ని అందుకోలేక పోయారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో తన 26 వ చిత్రాన్ని చేస్తున్నారు గోపిచంద్.

ఇక ఈ సినిమా తర్వాత మరోసారి సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇటీవలే ఫుల్ నరేషన్లో స్క్రిప్ట్ విన్న గోపిచంద్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మే నుంచి సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమాని ఎవరు నిర్మిస్తున్నారన్నది ఇంక తెలియాల్సి ఉంది.అన్నీ కుదిరితే ఈ ఏడాదే రెండు సినిమాలు విడుదల కానున్నాయి.

గతంలో వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ‘గౌతమ్ నంద ‘ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్స్ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.సరైన హిట్స్ లేక గోపిచంద్, రచ్చ తర్వాత సక్సెస్ లేని సంపత్ నంది ఈ సినిమాతో ఇద్దరూ హిట్ కొడుతారేమో చూడాలి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: