భాగోద్వేగానికి గురి చేసిన పలాస బేబీ పాట..!

మూడు నెలల క్రితం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది పలాస బేబీ గారు పాడిన పాట.ప్రేమికుడు సినిమాలోని ‘ఓ చెలియా నా ప్రియ సఖి’ అంటూ సాగే పాట పాడి తన గొంతులోని తియ్యదనాన్ని,మాధుర్యాన్ని బయట ప్రపంచానికి తెలియజేసింది.ప్రముఖ సంగీత దర్శకులు రఘు కుంచె గారు,కోటి గారు తమవంతు కృషి చేసి ఆమె విజయంలో ముఖ్యపాత్ర పోషించారు.మొదటగా తన ప్రతిభ గుర్తించిన రఘు కుంచె గారు మొదటి అవకాశం ఇస్తూ ఒక పాట రికార్డు చేయించారు, వీడియో రూపంలో ప్రైవేటు సాంగ్ చేసారు.సడెన్ సింగర్ గా పేరొందిన బేబీ గారు పాడిన ఈ పాటని టీజర్ రూపంలో రెండు నెలల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు.

కేవలం పల్లవి మాత్రమే విని లక్షలాది హృదయాలు భాగోద్వేగానికి లోనయ్యారు. ఎప్పుడప్పుడూ ఫుల్ సాంగ్ రిలీజ్ అవుతుందా అని యుట్యూబ్లో కామెంట్స్ రూపంలో ప్రేక్షకుల అభిమానం కనబడింది. నిన్న విడుదలైన ఈ పాట ప్రేక్షకులని భాగోద్వేగానికి గురి చేసింది, “మట్టి మనిషినండి నేను” అంటు సాగే ఈ పాట ఒక సగటు మనిషి జీవిత సారాన్ని, బ్రతుకులోని కష్టసుఖాల్ని, ప్రతి మనిషిలోని భాగోద్వేగాల్ని తట్టిలేపింది. ఈ పాటకి బేబీ గారి గొంతులోని సహజసిద్ధ మాధుర్యం,ప్రముఖ మాటల-పాటల రచయిత అయిన లక్ష్మీ భూపాల గారి సాహిత్యం, రఘు కుంచె గారు అందించిన సంగీతం అన్నీ చక్కగా కుదిరాయి.ప్రస్తుతం ఈ వీడియోని నాలుగు లక్షలకి పైగా వీక్షించారు, అందరూ పాజిటివ్ గానే స్పందించడం విశేషం.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.