అఖిల్ కొత్త సినిమా పై క్లారిటీ వచ్చింది…!

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో అఖిల్ సినిమా విషయాలే చర్చాంశనీయం అయ్యాయి.మొదటి సినిమా నుంచే మంచి హైప్ ఉన్న సినిమాలు చేస్తున్న అవి బాక్స్ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.మొన్నటి వరకు అక్కినేని అభిమానులందరూ ‘మిస్టర్ మజ్ను ‘ పై భారీ ఆశలు పెట్టుకున్నారు.యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది, దాంతో ప్రభావం సినిమా మీద పడింది.ఇది ఇలా ఉండగా అఖిల్ నాల్గవ సినిమా పై అప్పుడే పుకార్లు మొదలైయ్యాయి,అఖిల్ తన తర్వాతి సినిమాని శ్రీనువైట్ల దర్శకత్వంలో చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వార్తలు వచ్చాయి.

అసలే దర్శకులు శ్రీనువైట్ల కూడా గత కొంత కాలంగా ఫ్లాపుల్లో ఉన్నారు ఇలాంటి పరిస్థితిలో అఖిల్ వైట్ల గారితో సినిమా ఏంటనీ కంగారు పడ్డారు.ప్రస్తుతం ఆ అభిమానుల కంగారుకి ఫుల్ స్టాప్ పడింది, అవే ఫిల్మ్ నగర్ వర్గాలు ఈ విషయం పై స్పందించి ఫేక్ న్యూస్ గా తేల్చి చెప్పేశారు. అలాగే అఖిల్ తన తదుపరి చిత్రాన్ని మలుపు ఫేమ్ సత్య దర్శకత్వంలో చేస్తున్నట్లు ఖచ్చితమైన క్లారిటీ ఇచ్చారు. అతిత్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది,ఇక ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.