KALKI HONEST TRAILER TRENDING IN YOUTUBE | MALLESHAM GOT GOOD RESPONSE FROM PUBLIC
Skip to content

హాలివుడ్ ఆఫర్ అందుకున్న రాహుల్ రామకృష్ణ..!

Reading Time: 1 minute

సైన్మా షార్ట్ ఫిల్మ్ లో నటించి మెప్పించిన రాహుల్ రామకృష్ణ ఒకరకమైన ప్రేక్షకులకు మాత్రమే పరిచయం అయ్యారు. థియేటర్ ఆర్టిస్ట్ అయిన రాహుల్ కొన్నాళ్ళు స్టేజీ ఆర్టిస్ట్ గానే ఉండిపోయారు.అర్జున్ రెడ్డి సినిమాలో హీరో ఫ్రెండ్ గా శివ పాత్రలో చేసిన రాహుల్ కి మంచి బ్రేక్ దొరికింది, సినిమా మొత్తం హీరో బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటూ తెలంగాణ స్లాంగ్ లో సహజమైన నటనని కనబర్చి తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు వచ్చిన అందులో గీత గోవిందం, హుషారు సినిమాల్లో నటించి ఈ మధ్యకాలంలో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు.

జనరల్ గా ఇలాంటి బ్రేక్ వచ్చినప్పుడు తమిళంలో లేదా హిందిలో ఆఫర్స్ వస్తాయి, కానీ రాహుల్ కి ఇప్పుడు ఏకంగా హాలివుడ్ సినిమా ఆఫర్ వరించింది.ఇండియన్ వారైన ప్రదీప్ కాటసాని తెరకెక్కిస్తున్న ఇంగ్లీష్ సినిమా “సిల్క్ రోడ్” లో ఒక ముఖ్య పాత్ర కోసం రాహుల్ ని సెలక్ట్ చేసారు.ఈ విషయాన్ని రాహుల్ యే తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు,కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి అవకాశాన్ని దక్కించుకొని ఇలాగే కొనసాగితే మరో స్థాయికి చేరుకోవడం ఖాయం.

Spread the love

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.