
సతీష్ వేగేశ్న తర్వాతి సినిమా వివరాలు..!
శతమానంభవతి సినిమాతో మంచి బ్రేక్ అందుకున్నారు రచయిత మరియు దర్శకులు సతీష్ వేగేశ్న గారు.ఆహ్లాదకరమైన కుటుంబ కథతో వచ్చిన ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఘనవిజయం సాధించింది. అంతేకాకుండా ఈ చిత్రానికి జాతీయ అవార్డును అందుకున్నారు దర్శకుడు. గత ఏడాది నితిన్ తో మరోసారి కుటుంబ కథతో ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా తీసారు, అది ప్రేక్షకులను ఆకట్టుకున్నా, సరైన సమయంలో విడుదల కాకపోవడంతో కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు.

సెకండ్ ఇన్నింగ్స్ లో ఇలాంటి మంచి కుటుంబ కథ చిత్రాలు చేస్తున్న సతీష్ వేగేశ్న గారు శ్రీనివాస కళ్యాణం సినిమా వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు మరో సినిమా మొదలుపెట్టలేదు.ప్రస్తుతం “ఆల్ ఇజ్ వెల్” అనే ఆసక్తికరమైన టైటిల్ తో మరో సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో హీరోగా నాగ శౌర్య పేరు వినబడుతుంది, త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ చిత్రాన్ని ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా నిర్మించనున్నారు.