శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘మహానాయకుడు’….!

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన మొదటి భాగం ‘కథానాయకుడు’ సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదలై మంచి టాక్ తెచుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా విజయం సాధించలేకపోయింది.దీంతో చిత్ర బృందం రెండో భాగమైన ‘మహానాయకుడు’ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది,అందులో భాగంగా ఫిబ్రవరి 7 న విడుదల అవ్వాలిసిన ఈ చిత్రాన్ని 14 కి మార్చారు,ఇప్పుడు అది కూడా వాయిదా పడేలా కన్పిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది,ఎన్టీఆర్ హరికృష్ణ తో కలిసి చైతన్య రథం పై చైతన్య యాత్ర పేరుతో రాష్ట్రం అంతా పర్యటించిన విషయం తెలిసిందే.కాగా ఈ సన్నివేశాల తాలుకూ షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ లో శరవేగంగా జరుగుతున్నది.ఈ సన్నివేశాల్లో బాలకృష్ణ తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు.

మొదటి భాగం స్లో నేరేషన్లో సాగడమే ఈ చిత్రం కలెక్షన్స్ మీద ప్రభావం పడిందని సమాచారం,అందుకు దర్శకులు క్రిష్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎన్.బి.కె, వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: