అర్జున్ సురవరం గా పేరు మార్చుకున్న హీరో…!

ఇటీవలే టైటిల్ వివాదంలో పడింది నిఖిల్ నటిస్తున్న ‘ముద్ర’ చిత్రం,ఇలాంటి టైటిల్ తోనే మరొక సినిమా విడుదల కావడంతో చిత్ర బృందం మరో టైటిల్ ని ఫిక్స్ చేస్తాం అని ప్రకటించింది.అందుకు ఫుల్ స్టాప్ గా చిత్రం యొక్క టైటిల్,విడుదల తేదీలను అఫీషియల్ గా రిలీజ్ చేసింది టీం.ఈ సినిమా టైటిల్ వచ్చేసి ‘అర్జున్ సురవరం’ కాగా ఈ చిత్రం వేసవి కానుకగా మార్చి 29 న విడుదల కానుందని అని పోస్టర్ ద్వారా తెలియజేసారు.తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కనితన్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ టైటిల్ రోల్ లో జర్నలిస్ట్ గా కనిపించనున్నారు.సోషల్ ఇష్యూస్ బేస్ చేసుకొని తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తున్నది.

టి.సంతోష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సామ్ సిఎస్ సంగీతం అందిస్తుండగా రాజ్ కుమార్ ఆకెళ్ల,కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు,ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.