బాహుబలి 2 రికార్డును క్రాస్ చేసిన బాలీవుడ్ చిత్రం…!

బాహుబలి 2 రికార్డును క్రాస్ చేసిన బాలీవుడ్ చిత్రం…!

భారతీయ చలనచిత్ర రంగంలో బాహుబలి ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం బాలీవుడ్లో విడుదలైన ఓ చిత్రం ఈ సినిమా రికార్డులను క్రాస్ చేసింది, జనవరి 11 న విడుదలైన యూరి ది సర్జికల్ స్ట్రైక్ ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురుపిస్తుంది.అసలు విషయంలోకి వెళితే 2017 లో విడుదలైన బాహుబలి రెండో భాగం అన్నీ భాషల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు వసూలు చేసింది.హిందీ వెర్షన్లో విడుదలైన బాహుబలి 2 ఫుల్ రన్ లో 500 కోట్లు సాధించింది.

కాగా ఈ యూరి చిత్రం ఫుల్ రన్ తో రెండు వందల కోట్ల క్లబ్ కి దగ్గరైంది.
బాహుబలి 2 23 వ 6.35 కోట్లు రాబట్టగా 24 వ రోజు 7.85 కోట్లు వసూల్ చేసింది, అయితే యూరి ది సర్జికల్ స్ట్రైక్ 23 వ రోజు 6.53 కోట్లు,24 వ రోజు 8.71 కోట్లు కొల్లగొట్టడం తో హిందీ బాహుబలి రికార్డ్స్ ను క్రాస్ చేసింది.
భారీ మరి ఏ ఇతర తారాగణం ఎవ్వరూ లేకుండా వచ్చిన ఈ సినిమా ఈ సంవత్సరం బాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.2016 లో భారత సైన్యం పాక్ మిలిటెంట్ల పై జరిపిన సర్జికల్ స్ట్రైక్ ని ఆధారంగా తీసుకుని ఈ చిత్రం రూపొందించబడింది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: