మూడు పాత్రల్లో కనిపించనున్న న్యాచురల్ స్టార్…!

ప్రస్తుతం జెర్సీ షూటింగ్ ముగించుకొని మరో సినిమాకి రెడీ అవుతున్నాడు నాని.ఇష్క్,మనం,24 చిత్రాల ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కబోతుంది.ఫిబ్రవరి 19 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది,ఇక ఈ సినిమా లో నాని మూడు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నాడు.అందులో ఒకటి యువకుడిగా,మిడిల్ ఏజ్డ్ ఇంకా వృద్ధుడిగా,గతం లో ఇదే డైరెక్టర్ నుంచి వచ్చిన ’24 ‘ సినిమాలో కూడా సూర్య ఇలాగే మూడు విభిన్న పాత్రల్లో నటించాడు,మళ్ళీ ఇప్పుడు నానిని కూడా అదే తరహాలో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమా లో నాని సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారని సమాచారం.ఇప్పటికే కీర్తి సురేష్ , ప్రియా ప్రకాష్ వారియర్,మేఘ ఆకాష్ లను ఫైనల్ చేసారు,మరో ఇద్దర్నీఎంపిక చేసే పనిలో ఉన్నారు.దర్శకులు విక్రమ్ కుమార్ తన ప్రతి సినిమాలో హీరోయిన్ పాత్రకి ప్రియ అనే పేరు పెడతారు,మరి ఈ సినిమాలో ఏకంగా ఐదు హీరోయిన్లు చేస్తున్నారు వాళ్లలో ఎవరికీ ఈ పేరు పెడుతారో చూడాలి.

హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ది క్యూరియస్ కేస్ అఫ్ బెంజిమెన్ బటన్’ చిత్రాన్ని స్ఫూర్తిగా  తీసుకోని తెరకెక్కించనున్నారు విక్రమ్ కె కుమార్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: