KALKI HONEST TRAILER TRENDING IN YOUTUBE | MALLESHAM GOT GOOD RESPONSE FROM PUBLIC
Skip to content

అభిమానులకి,ప్రేక్షకులకి మెగా పవర్ స్టార్ లేఖ…!

Reading Time: 1 minute

రంగస్థలం సినిమాతో నటుడిగా కెరీర్ బెస్ట్ పర్ఫామేన్స్ ఇచ్చారు రామ్ చరణ్,ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు అనగానే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి.అన్నీఅనుకున్నట్లుగానే వినయ విధేయ రామ సినిమాని సంక్రాంతి కి తీసుకొచ్చారు దర్శక నిర్మాతలు.ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది,రామ్ చరణ్ ఇంక దర్శకులు బోయపాటి శ్రీను కెరీర్ లోనే పెద్ద డిసాస్టర్ గా నిలిచింది.రంగస్థలం లాంటి భారీ హిట్ తర్వాత రామ్ చరణ్ ని ఈ సినిమాలో చూసి అభిమానులతో సహా సగటు ప్రేక్షకులు సైతం జీర్ణించుకోలేకపోయారు.సినిమా విడుదల తర్వాత కూడా చిత్ర బృందం నుండి ఎవ్వరూ స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.చివరకు రామ్ చరణ్ లేఖ ద్వారా ఈ సినిమా పై స్పందించారు.

మీ అందరికీ నచ్చి,మిమ్మల్ని వినోదింపచేసే సినిమా అందించడానికి మేమంతా ఎంతగానో శ్రమించాం.దురదృష్టవశాత్తు మేము అనుకున్న విధంగా ఒక మంచి సినిమా అందించలేక మీ అంచనాలను అందుకోలేకపోయాం.ఈ సందర్భంగా సినిమాని కొన్న పంపిణీదారులకు,ప్రదర్శనదారులకు కృతజ్ఞతుడై ఉంటానని చెప్పారు.ఈ సినిమాకి పని చేసిన సాంకేతిక నిపుణులకి,ముఖ్యంగా నిర్మాత డి.వి.వి. దానయ్య గురించి ఈ లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.ఏదేమైనా ఇలా ప్లాప్ అయినా సినిమా పై చరణ్ స్పందించడం ఇతర అభిమానులను సైతం కదిలిస్తుంది.

Spread the love

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.