నయనతార మరో సూపర్ హిట్ సినిమా తెలుగులోకి…!

గత సంవత్సరం కోలివుడ్లో సూపర్ హిట్ అయిన చిత్రాల్లో ‘ఇమ్మాయిక నోడిగళ్’ ఒకటి. లేడి సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ‘అంజలి సి.బి.ఐ ఆఫీసర్ ‘ పేరుతో తెలుగులోకి డబ్ అవుతుంది.లవ్ & క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయనతార నటన ప్రత్యేక ఆకర్షణ అయితే అథర్వ మురళి,రాశీ ఖన్నా ల కెమిస్ట్రీ సినిమాకే హైలెట్ అయింది.ఇక సంవత్సరం ప్రారంభంలోనే విశ్వాసం సినిమాతో మొదటి హిట్ అందుకుంది నయనతార, ఇది ఇంకా తెలుగులో విడుదల అవ్వాల్సి ఉంది.అలాగే సైరా,విజయ్ అట్లీ ల కాంబినేషన్లో వస్తున్న సినిమాల్లో నటిస్తుంది.ఈ రెండు సినిమాలు కూడా ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: