ఫ్లాప్ అయిన సినిమాలు మళ్ళీ సూపర్ హిట్ అవుతున్నాయి…!

మన తెలుగు సినిమాలు అత్యధికంగా ఇతర భాషలో డబ్ అయ్యేది ఒక్క హిందీలోనే.మన దగ్గర ఆ సినిమాల ఫలితం ఎలా ఉన్నా హిందీ లో మాత్రం అవి సూపర్ హిట్ అవుతాయి,ఇదివరకే ఇది రుజువైన విషయం.యువ హీరో రామ్ నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ తెలుగులో ఆశించినంతగా విజయం సాధించలేదు,నేను శైలజా తర్వాత మరోసారి కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో అంచనాలను అందుకోలేకపోయింది.అయితే తాజాగా నాలుగు రోజుల క్రితం హిందీ డబ్బింగ్ వెర్షన్ ను ‘నెంబర్ వన్ దిల్ వాలా’ పేరుతో గోల్డ్ మైన్ టెలిఫిల్మ్ యూట్యూబ్లో అప్ లోడ్ చేయగా కేవలం నాలుగు రోజులలో 34 మిలియన్ల వ్యూస్ తో సరికొత్త రికార్డు సృష్టించింది.ఇంత తక్కువ సమయంలో ఈవిధంగా ఈ సినిమాకే ఇన్ని హిట్స్ పడడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా హీరో రామ్ కూడా ట్వీట్టర్ లోను ప్రత్యేకంగా యూట్యూబ్లో కామెంట్ బాక్స్ లో తన ఆనందాన్నీ వ్యక్తం చేస్తూ ప్రేక్షకులను పలకరించారు.

గతంలో కూడా అల్లు అర్జున్ నటించిన సరైనోడు, డిజె,నా పేరు సూర్య సినిమాలూ సరికొత్త రికార్డును సృష్టించాయి.ఇలా ఈ సినిమాలే కాకుండా బుల్లితెర పై పలు ఛానెల్స్ లో ప్రసారం అయ్యే మన తెలుగు సినిమాలకి హిందీ ప్రేక్షకుల్లో అద్భుతమైన రెస్పాన్స్ ఉంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.