డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసుకున్న మహర్షి…!

మహేష్ బాబు వంశీ పైడిపల్లి ల కాంబినేషన్లో వస్తున్న సినిమా మహర్షి, ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఇటీవలే పొల్లాచిలో ఒక షెడ్యూల్ ముగించుకుని, చివరి షెడ్యూల్ అబు ధాబిలో జరగనుంది. ఇక పూజా కార్యక్రమాలతో ఈరోజు డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసుకుంది, నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఈ సినిమా పై ఖచ్చితమైన నమ్మకంతో ఉన్నారు. సరికొత్త కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని ఇటీవలే జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పారు.

ఆ పై సంవత్సరం దిల్ రాజు ఏకంగా ఆరు సినిమాలు చేసి ఆరు హిట్స్ అందుకున్నారు,కానీ గత సంవత్సరం విడుదలైన ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఇక ఈ సంవత్సరం ఆరంభంలోనే F2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నారు.మహర్షి తర్వాత మహేష్ బాబు తో త్వరలోనే మరో చిత్రాన్ని నిర్మించనున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: