
వర్మని ఆపేసిన ఆ సినిమా నిర్మాతలు…!
వర్మని ఆపేసిన ఆ సినిమా నిర్మాతలు…!
అర్జున్ రెడ్డి సినిమా సెన్సేషన్ బ్లాక్ బస్టర్ అయ్యింది, ఆ సినిమాకి దర్శకత్వం వహించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా,హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఇద్దరూ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు,అలాగే తెలుగు సినిమా రికార్డ్స్ ని సైతం తిరగరాసింది.ఇంత పెద్ద అఖండ విజయం అందుకున్న సినిమా తమిళంలో విచిత్ర సినిమాల దర్శకులు బాలా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల టైం దగ్గర పడుతుండటంతో ఎలాంటి ప్రమోషన్ లేకపోవడంతో ప్రేక్షకుల్లో సందేహం మొదలైంది.

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల చేయడం లేదని నిర్మాతలు తేల్చి చెప్పేశారు.అవునూ, తమిళంలో విడుదలైన ఫస్ట్ లుక్ కానీ,టీజర్, ట్రైలర్ ఏవీ ఆకట్టుకునే విధంగా లేవు.ఈ సినిమా అవుట్ పుట్ ఈ సినిమా నిర్మాతలకి నచ్చలేదట,ఒక్క హీరో ధృవ్ తప్ప మిగితా ఆర్టిస్ట్ లను మార్చేసి మళ్ళీ రీషూట్ చేసే ఆలోచనలో ఉన్నారట.ఈ సారి దర్శకుడు బాలా కాకుండా వేరే ఇంకెవరైనా సినిమా రేంజ్ కి తగ్గట్లు దర్శకుడ్ని ఎంపిక చేసి రీషూట్ చేస్తారంట.ఇక హిందీలో కబీర్ సింగ్ గా వస్తున్న ఈ చిత్రాన్ని ఒరిజినల్ వెర్షన్ ని తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా నే దర్శకత్వం వహిస్తున్నారు.