మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్…?

భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత మారుతి కి ఆ స్థాయి హిట్ సినిమా ఇవ్వలేదు.గత సంవత్సరం వినాయక చవితి కానుకగా విడుదలైన శైలజారెడ్డి అల్లుడు కూడా పరాజయం పొందింది. ప్రస్తుతం మారుతీ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో ఓ చిత్రం చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.ఇక సాయి ధరమ్ తేజ్ కి కూడా సుప్రీమ్ సినిమా తర్వాత మరో హిట్ లేదు దాదాపు మూడేళ్ళు కావోస్తుంది.

ప్రస్తుతం నేను శైలజా ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి ‘ అనే సినిమా చేస్తున్నారు, ఏప్రిల్ 12 న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తర్వాతే మారుతీ దర్శకత్వంలో చేసే అవకాశం ఉంది.ఈ కాంబినేషన్ గనుక సెట్ అయితే మారుతీ సాయి ధరమ్ తేజ్ ని ఎలాంటి కోణంలో చూపిస్తారో చూడాలి. త్వరలోనే ఈ సినిమా పై మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: