మజిలీ టీజర్….చైతూ ఆటిట్యూడ్ వీర లెవల్స్…!

నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వణా దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా వస్తున్న చిత్రం ‘మజిలీ’ అందరికీ తెలిసిన విషయమే. పెళ్లి తర్వాత చైతూ సమంత కాంబినేషన్లో సినిమా రావడం, అలాగే నిన్ను కోరి లాంటి క్లాసిక్ హిట్ అందుకున్న డైరెక్టర్ నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ముందు నుంచే ఒకస్థాయిలో ఉన్నాయి. ఇక నిన్న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన టీజర్ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్ళింది.

టీజర్లో చైతూ యంగ్ పాత్రలో ప్రేమమ్ సినిమాలో తరహా కనిపించగా సినిమాలో సమంతని పెళ్ళి చేసుకున్న తర్వాత లైఫ్ లో ఫెయిల్ అయిన భర్త గా కనిపించనున్నారు.టీజర్లో ఉన్న డైలాగ్స్ కూడా నెటిజన్లను బాగానే ఆకట్టుకున్నాయి,అందులో ఒకటి ‘ వెధవలకు ఎప్పుడూ మంచి పెళ్ళాలే దొరుకుతారని మళ్ళీ నువ్వే ప్రూవ్ చేశావ్’ ఈ సీన్ లో భర్తను ప్రేమించే భార్య గా సమంత సహజమైన నటనను కనబర్చిందని చెప్పొచ్చు.లైఫ్ లో ఫెయిల్ అయిన ఒక క్రికెటర్ జీవితంలో పెళ్ళి తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది..?తిరిగి ఎలాంటి విజయాన్ని అందుకున్నాడు అనే నేపథ్యంలో భార్య భర్తల మధ్య అనుబంధాన్ని వివరించే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతుంది. షైన్ స్క్రిన్ పతాకంపై సాహు గారపాటి,హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటి దివ్యాంశ కౌషిక్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 5 న విడుదల కానుంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.