ఎవర్ గ్రీన్ క్లాసిక్ మురారి కి 18 సంవత్సరాలు…!

మహేష్ బాబు కెరీర్‌లో ఎన్ని సినిమాలున్న మురారి సినిమా మాత్రం చాలా ప్రత్యేకమైనది.రాంప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై ఎన్.రామలింగేశ్వరావు నిర్మాతగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎమోషన్ల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది.రాజకుమారుడు సినిమా తర్వాత వచ్చిన రెండు సినిమాలు బోల్తా కొట్టగా,ఈ సినిమా మాత్రం మహేష్ బాబు కి సొంత అభిమానులని సంపాదించి పెట్టింది.ఈ సినిమాకి కృష్ణవంశీ గారి కథ, స్క్రీన్‌ప్లే,మాటలు ఒక ఎత్తు అయితే అతని దర్శకత్వం మరో ఎత్తు అని చెప్పొచ్చు.ఇక కృష్ణవంశీ తర్వాత ప్రాణం పెట్టి చేసింది మహేష్ బాబు గారే, ఈ సినిమాలో అతని నటనకి ప్రేక్షకులు మంత్రముగ్ధులైయ్యారు. అలాగే అటు అందంతో,ఇటు తనదైన శైలిలో డ్యాన్స్ లతో అమ్మాయిల రాకుమారుడిగా మారారు.

మూడో విషయానికొస్తే ఈ సినిమాలో హీరోయిన్ సోనాలి బింద్రే తో పాటు ఇతర తారాగణం అయిన లక్ష్మీ గారు ,కైకలా సత్యనారాయణ గారు, గొల్లపూడి గారు అలాగే శభరి పాత్రలో చేసిన బామ్మ గారు సుధ,హేమ,అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా,చిన్నా,రఘుబాబు,రవిబాబు ఇలా ఆర్టిస్టులందరూ చక్కగా సరిపోయారు,వాళ్ళ వాళ్ళ పాత్ర మేరధి వరకు నటించి మెప్పించి ఆ పాత్రల్లో శాశ్వతంగా ఒదిగిపోయారు. ఇక మణిశర్మ అందించిన సంగీతం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు,అన్నీ పాటలు సూపర్ హిట్ అయ్యాయి ముఖ్యంగా ‘అలనాటి రామచంద్రుడు ‘ పాట చార్ట్ బస్టర్ అయింది. ఈ రోజుకి మన తెలుగు పెళ్ళిల్లో ఈ పాట మారు మోగుతునే ఉంది.2001 సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సిన సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల వల్ల ఆలస్యమై ఫిబ్రవరి 17 న అంటే సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఈ రోజున విడుదల అయ్యింది.
విడుదలైన అన్నీ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడి సరికొత్త రికార్డును సృష్టించింది,అలాగే పలు సెంటర్స్ లో మొత్తం మీద విజయవంతంగా 175 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఉత్తమ నటుడిగా స్పెషల్ జ్యూరీ నంది అవార్డు అందుకున్నారు.ఇప్పటికీ ఎప్పటికీ కృష్ణవంశీ గారి కెరీర్‌లో కానీ మహేష్ బాబు గారి కెరీర్‌లో గానీ మురారి సినిమా మైల్ స్టోన్ అని చెప్పొచ్చు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: