
షూటింగ్ లో గాయపడిన గోపిచంద్…!
ప్రస్తుతం హీరో గోపిచంద్ తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలోని కీలకమైన షెడ్యూల్ జైపూర్ లో జరుగుతున్నది, కాగా ఈ షెడ్యూల్ చివరి దశలో ఉండగా పోరాట ఘట్టంలో భాగంగా బైక్ ఛేజింగ్ కు సంబంధించిన సన్నివేశం చిత్రీకరిస్తుండగా బైక్ స్కిడ్ అయి గోపిచంద్ కు స్వల్పంగా గాయలైయ్యాయి.అయితే ప్రమాద విషయమై ఎలాంటి హాని లేదని అక్కడి డాక్టర్లు చెప్పేశారు.

అవసరమైన విశ్రాంతి ఇస్తే సరిపోతుందని చెప్పడంతో చిత్ర బృందం కూడా అందుకు తగ్గట్లుగా షూటింగ్ విషయంలో తగిన సూచనలు తీసుకుంటుందంట.ఏకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా ప్రముఖ రచయిత అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు, వేసవి కానుకగా మే లో ఈ చిత్రం విడుదల కానుంది.