ఉత్కంఠభరితంగా సాగనున్న మహానాయకుడు..!

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన మొదటి భాగం ‘కథానాయకుడు’ సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదలై మంచి టాక్ తెచుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా విజయం సాధించలేకపోయింది.దీంతో చిత్ర బృందం రెండో భాగమైన ‘మహానాయకుడు’ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.అనవసరమైన సన్నివేశాలన్నీ తొలగించేసి కేవలం ముఖ్యమైన వాటిని మాత్రమే ఉంచుతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే చెప్పుకొచ్చింది.ఇటీవలే విడుదలైన ట్రైలర్ చూస్తూంటే సినిమా ఉత్కంఠభరితంగా సాగనుందని చెప్తుంది.ఎన్టీఆర్‌ గారి రాజకీయ జీవితంలో ముఖ్యమైన రెండు కీలక వివాదాలు, ఒకటి నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు కాగా,రెండోది చంద్రబాబు ఎన్టీఆర్ ను విభేదించి చేసిన తిరుగుబాటు.ఈ రెండు విభేదాల్లో నాదెండ్ల భాస్కరరావు చేసిన వెన్నుపోటును మాత్రమే ఈ సినిమాలో చూపించబోతున్నారట.

అలాగే మహానాయకుడు ఎన్టీఆర్ చివర దశ వరకు ఉండట,కేవలం రెండో సారి సీఎం అయినంతవరకు మాత్రమే సినిమా ఉంటుందని సమాచారం.ఈ సమాచారానికి తోడు ఈ సినిమా రన్ టైం కూడా దీన్ని అనుమానించేలానే ఉన్నాయి,ఈ సినిమా రన్ టైం వచ్చేసి 2 గంటల 8 నిమిషాలు.ఇంత క్రేజ్ ఉన్న సినిమాకి ఇంత తక్కువ టైం ఈ మధ్య కాలంలో లేదు. ఫిబ్రవరి 7 న విడుదలవ్వాల్సిన సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ వారం అంటే ఈ నెల 22 న మళ్ళీ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం బాక్స్ఆఫీస్ వద్ద ఏ సినిమా ఒకస్థాయిలో ఆడట్లేదు కాబట్టి ఈ సారి మహానాయకుడు కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయం అనిపిస్తుంది.
ఎన్.బి.కె, వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా,ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు అందించారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.