KALKI HONEST TRAILER TRENDING IN YOUTUBE | MALLESHAM GOT GOOD RESPONSE FROM PUBLIC
Skip to content

ప్రముఖ రంగస్థల నటులు దీక్షితులు ఇకలేరు..!

Reading Time: < 1 minute

మురారి సినిమాలో పూజారిగా చేసిన శేషయ్య అనే పాత్ర ఆ సినిమాతో పాటు అందరూ గుర్తుంచుకునే పాత్ర అలాంటిది.ఆ పాత్ర పోషించిన ప్రముఖ రంగస్థల నటులు దీక్షితులు నిన్న సాయంత్రం గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. ఒక సీరియల్ షూటింగ్ లో ఉండగా హఠాత్తుగా గుండె పోటు రావడంతో ఆయన్ని నాచారంలోని ఒక ఆసుపత్రికి తరలించారు, అయితే అప్పటికే ఆయన మరణించినట్లు తెలిసింది. దీక్షితులు గారి పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు, స్వస్థలం గుంటూరు జిల్లా, రేపల్లె. దీక్షితులు తెలుగు, సంస్కృత భాషల్లో రంగస్థల కళల్లో ఎం.ఏ డిగ్రీలు పొందారు. సొంతూర్లోని జూనియర్ కళాశాల లో లెక్చరర్‌గా పనిచేశారు, ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్ వచ్చారు.దీక్షితులు తెలుగు సినిమా పరిశ్రమలో పేరున్న పలు ఆర్టిస్టులకి నటనలో శిక్షణ ఇచ్చారు, అలాగే థియేటర్ ఆర్టిస్ట్ గా డిప్లోమా చేస్తున్న సమయంలో పలు నాటకాలకు దర్శకత్వం కూడా వహించారు. అలాగే ఆగమనం సీరియల్ కు నంది అవార్డు అందుకున్నారు.

దీక్షితులు పలు సినిమాల్లో నటించిన అందులో మురారి, అతడు సినిమాల్లో అతని పాత్రకు మంచి పేరు లభించింది,ఇక వీటితోపాటు ఇంద్ర,ఠాగూర్,వర్షం సినిమాల్లోను నటించారు. దీక్షితులు గారి మరణ వార్తా తెలిసిన అనంతరం తెలుగు సినీ ప్రేక్షకులు సోషల్ మీడియా లో స్పందించి నివాళులు అర్పించారు.

Spread the love

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.