ప్రారంభం అయిన నాని కొత్త చిత్రం…!

న్యాచురల్ స్టార్ నాని విభిన్న కథ చిత్రాల దర్శకుడు విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం నిన్న పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. దేవుని చిత్రపటాల పై చిత్రీకరించిన మొదటి సన్నివేశానికి ప్రముఖ దర్శకులు కొరటాల శివ క్లాప్ కొట్టగా,శ్రేష్ఠ్ మూవీస్ అధినేత ఎన్.సుధాకర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు.నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత శరత్ మరార్ స్క్రిప్ట్ ను అందించారు.ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు మాట్లాడుతూ “మా సంస్థలో వస్తున్న మరో విచిత్రమైన సబ్జెక్టు ఇది,తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని” అన్నారు.

దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ ‘ ఫస్ట్ టైం నేను చేస్తున్న పూర్తి ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న చిత్రమిది ‘ , ఎంటర్టైన్మెంట్ యే కాకుండా ఒక కొత్త రకమైన థ్రిల్లర్ పాయింట్ తో సినిమా ఉండబోతుంది అదేంటనేది స్క్రీన్‌ప్లే చూస్తేనే అర్థమౌతుందని చెప్పారు.

ఇక ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రఫర్ మిరోస్లా కుబా బ్రోజక్ కెమెరా అందిస్తుండగా ఎడిటర్ గా నవీన్ నూలి పని చేస్తున్నారు.ప్రియాంక అనే కొత్త నటి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు.రేపటి నుంచి ఈ‌ సినిమా రెగ్యూలర్ షూటింగ్ నాన్ స్టాప్ గా జరుపుకోనుంది.ఇక నాని నటించిన జెర్సీ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటుంది, ఏప్రిల్ 5 న ఈ సినిమా విడుదల కానుంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: