పన్నెండు సంవత్సరాల క్రితం ఢీ కొట్టి మళ్ళీ రెడీ..!

దూకుడు సినిమా వరకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పేరు తెచ్చుకున్నారు దర్శకులు శ్రీనువైట్ల.ఆనందం,సొంతం, వెంకీ, అందరివాడు,ఢీ,దుబాయి శ్రీను,రెడీ,కింగ్, నమో వెంకటేశ,దూకుడు ఇలా అన్నీ సినిమాల్లో కమెడీకే ప్రాధాన్యత ఇచ్చి అటు మాస్ ఇటు క్లాస్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా సినిమాలు చేసారు. అయితే బాద్షా సినిమాతో పర్వాలేదనిపించుకున్న ఆ తర్వాత వచ్చిన ఆగడు,బ్రూస్లీ,మిస్టర్ సినిమాలతో రొటీన్ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఘోర పరాజయాలను చవి చూసారు.అయితే నాలుగో సారి రవితేజతో రొటీన్ కి భిన్నంగా చేస్తూ అమర్ అక్బర్ ఆంథోనీ చేసారు, గత సంవత్సరం చివర్లో విడుదలైన ఈ సినిమా ఫార్ములా వర్క్ అవుట్ కాకపోవడంతో మళ్ళీ డిజాస్టర్ అందుకున్నారు.ఇక రవితేజ గారికి కూడా రాజా ది గ్రేట్ తర్వాత ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ సినిమా మీద ఉన్న అంచనాలు తలక్రిందులు అయ్యాయి.


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీనువైట్ల మళ్ళీ తన తర్వాతి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నారట.అంతేకాకుండా ఈ సినిమా కోసం హీరో మంచువిష్ణు ని సంప్రదించారట,విష్ణు కూడా ఆచారి అమెరికా యాత్ర తర్వాత ఏ సినిమా మొదలెట్టలేదు అందులోనూ ఆడో రకం ఈడో రకం తర్వాత ఒక్క హిట్ సినిమా లేదు కాబట్టి విష్ణు పూర్తి డేట్స్ శ్రీనువైట్ల సినిమా కోసం ఇచ్చినట్లు సమాచారం. ఇక ఇంతకుముందే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ ఢీ’ సినిమా ఇద్దరి కెరీర్‌లో మైల్ స్టోన్ గా నిలిచింది. పన్నెండు సంవత్సరాల తరువాత మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో అంచనాలు మళ్ళీ మొదలైయ్యాయి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: