నాని 24 లో సెన్సేషన్ హీరో…!

నాని విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతుంది. ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలతో తెలుగు ప్రేక్షకులను అలరించేలా సినిమాలు చేస్తున్న విక్రమ్ కుమార్ ఈ సినిమాలో కూడా ఒక కొత్త తరహా పాయింట్ తో పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్లో సినిమా ఉంటుందని ప్రారంభోత్సవ కార్యక్రమంలో చెప్పారు.ఇక ఈ సినిమాలో నానికి జోడిగా ప్రియాంక అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. మరో ఆసక్తికరమైన విషయానికొస్తే ఈ చిత్రంలో మరో హీరో నటిస్తున్నట్లు వార్తాలోచ్చాయి,అవునూ ఇది నిజం. గత సంవత్సరం ఆర్ ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన హీరో కార్తీకేయా. ఆ సినిమా తర్వాత వరుసగా రెండు సినిమాలతో బిజీ అయ్యారు.అయితే కార్తీకేయా ఇప్పుడు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్నీ కార్తీకేయానే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఇలాంటి ఒక ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులో నటించడం ఆనందంగా ఉందని,అలాగే తనకి స్ఫూర్తిదాయకంగా నిలిచిన నాని గారితో ఎప్పుడెప్పుడు షూటింగ్లో పాల్గొంటానా అని ఆనందం వ్యక్తం చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ తమిళ యువ సంచలన సంగీత దర్శకులు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: