సీనియర్‌ హీరోలకు జోడిగా సెన్సేషన్ హీరోయిన్..!

ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.ఆ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది, అంతేకాకుండా ఆ సినిమాలో తన గ్లామర్స్ తో కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది. ఆర్ ఎక్స్ 100 తర్వాత ఈ పంజాబీ భామకు అవకాశాలు భారీ స్థాయిలో వచ్చాయని చెప్పొచ్చు, అయితే ఆ వచ్చిన అవకాశాలు అన్నీ మన సీనియర్ హీరోల పక్కనే రావడం విశేషం.ఇది వరకే ఎన్టీఆర్ కథానాయకుడులో డైలాగ్స్ లేకపోయిన అడవిరాముడు సెట్ లో నందమూరి బాలకృష్ణ పక్కన కనిపించింది.ఇక ఇప్పటికే డిస్కోరాజా సినిమాలో రవితేజకు జోడిగా నటిస్తుంది,వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అదేవిధంగా ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, చైతూల మల్టీస్టారర్ గా వస్తున్న వెంకీ మామాలో వెంకటేష్ గారి సరసన నటిస్తుంది, అలాగే నాగార్జున గారి సరసన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న మన్మథుడు 2 లో చేయనుంది.ఇలా సీనియర్ హీరోల పక్కన ఈ మధ్యకాలంలో అదికూడా అతితక్కువ కాలంలోనే నయనతార, అనుష్క తర్వాత పాయల్ రాజ్ పుత్ కే ఈ అవకాశం దక్కిందని చెప్పొచ్చు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: