తమిళ రీమేక్ లో బెల్లకొండ సాయి శ్రీనివాస్..!

జయ జానకి నాయక తర్వాత బెల్లకొండ సాయి శ్రీనివాస్ కి ఆ స్థాయి సినిమా రాలేదని చెప్పొచ్చు.ఈ మధ్యే వచ్చిన కవచం పర్వాలేదనిపించుకున్న సరైన విజయాన్ని అందుకోలేక పోయింది. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సీత అనే సినిమా చేస్తున్నాడు,ఇందులో సాయికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నది.ఈ సినిమా సమ్మర్ మధ్యలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాతో పాటు సాయి మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.గత ఏడాది కోలివుడ్లో సూపర్ హిట్ అయిన చిత్రాల్లో రాట్ససన్ ఒకటి. రామ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విష్ణు విశాల్,అమలా పాల్ నటించారు.

సైకాలజీ కల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో రైడ్,వీర ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నారు.ఇక ప్రతి సినిమా స్టార్ హీరోయిన్లతోనే చేసే సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో ఎవరితో జతకడుతారో చూడాలి,ప్రస్తుతం ఇద్దరి స్టార్ హీరోయిన్ల‌ పేరు వినబడుతుంది. ఈ సినిమా ఎవరు నిర్మిస్తున్నారన్నది ఇంక తెలియ లేదు, మరిన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.