సైరా లో మెగా డాటర్ పాత్ర…!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి ‘. ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నయనతార, తమన్నా ,బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు,సుధీప్,జగపతిబాబు, విజయ్ సేతుపతి లాంటి భారీ తారాగణం అంతా నటిస్తుండడం విశేషం. అయితే ఈ సినిమాలో‌ ఒక ముఖ్య సన్నివేశంలో మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిస్తున్నది.ఇటీవలే ఆ పాత్రకి సంబంధించిన సన్నివేశాన్ని చిత్రీకరించారట చిత్రబృందం,ఈ సినిమాలో నిహారిక ఓ గిరిజన యువతిగా ,పోరాట సమయంలో ఒక ఆపదమైన సీన్ లో చిరంజీవి గారికి ఆశ్రయం ఇచ్చే యువతిగా కనిపిస్తుందంట.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగష్టులో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: