సాహో షేడ్స్ ఛాప్టర్ 2 ఎప్పుడంటే…!

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో,అందరికీ తెలిసిన విషయమే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క సాహో షేడ్స్ ఛాప్టర్ 1 అంటూ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో రూపంలో విడుదల చేశారు. గత సంవత్సరం ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేసిన ఈ ప్రోమో అప్పటి వరకు ఉన్న అంచనాలను డబుల్ చేసింది.అటు ప్రభాస్ అభిమానులనే కాకుండా సగటు ప్రేక్షకున్ని సైతం ఆకట్టుకుంది.ప్రస్తుతం మళ్ళీ అదే తరహాలో సినిమాకి సంబంధించి ఛాప్టర్ 2 విడుదల చేయనుంది చిత్ర బృందం, ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రద్ధాకపూర్ పుట్టిన రోజు కానుకగా మార్చి మూడో తేదిన ఈ ప్రోమోని విడుదల చేయనున్నారు.ఈ ప్రోమోకి ఇటు ఆదివారం అటు సోమవారం మహాశివరాత్రి కలిసి రానుంది, దీంతో యూట్యూబ్ లో అత్యంత వీక్షకులను అలరించడం ఖాయం అనిపిస్తుంది.

రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇదే సంవత్సరం ఆగస్టు 15 న విడుదల కానుంది,భారతదేశ వెండితెర మీద మొట్టమొదటి సారిగా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో వస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుండగా బాలీవుడ్ సంగీత దర్శకులు శంకర్ ఏహ్ సాయన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: