మహేష్ బాబు నిర్మాణంలో అడవి శేషు సినిమా..!

ప్రస్తుతం సినిమాలతో పాటు అటు యాడ్స్ లోను ఇటు బిజినెస్‌ లోను రాణిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.ఇటీవలే ఏషిన్ సినిమాస్ సంస్థతో ఏ.ఎం.బి సినిమాస్ పేరుతో హైదరాబాదులోని గచ్చిబౌలి లో ఓ మల్టీప్లెక్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉండగే ఇంతకుముందే శ్రీమంతుడు సినిమాతో నిర్మాణంలో అడుగుపెట్టిన మహేష్ బాబు ఈ సారి రెండు సంస్థలతో కలిసి ఓ సినిమాని నిర్మించబోతున్నారు.2008 లో 26/11 ముంబైలో జరిగిన టెర్రరిస్టు అటాక్ లో ఆర్మీ వాళ్ళు జరిపిన ఎదురు దాడిలో ప్రధాన పాత్ర పోషించిన సందీప్ ఉన్నికృష్ణన్‌ పాత్రని స్ఫూర్తిగా తీసుకొని ‘మేజర్‌ ‘ అనే సినిమా చేయబోతున్నారు.

సోని సంస్థ వారు జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ యస్ వారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించబోతున్నారు.అడవి శేషు ప్రధాన పాత్ర పోషిస్తుండగా గూఢచారి సినిమాతో పరిచయం అయిన శశికిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు ఈ విషయాన్నీ ఈ సినిమా నిర్మాతలే అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా 2020 లో తెరమీదకు రానుంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: