అఖిల్ తదుపరి చిత్రం పై లేటెస్ట్ అప్ డేట్స్…!

మిస్టర్ మజ్ను తో కూడా అఖిల్ హిట్టు కొట్టలేకపోయాడు.మొదటి రెండు చిత్రాలు అటు ఉంచితే ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీగా ఆశలు పెట్టుకొని ఉండే,కానీ వారి అంచనాలు తలక్రిందులు అయ్యాయి.అయినా సరే సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్వీట్టర్లో అభిమానులు అఖిల్ తర్వాతి సినిమా మీద అంచనాలు పెట్టుకున సాగారు.ఫలానా డైరెక్టర్ తో ఫలానా రకమైన కథతో అఖిల్ సినిమా చేస్తే ఈ సారి గట్టి హిట్ కొట్టవచ్చు అని వాళ్ళకు వాళ్ళే ప్రశ్నించుకుంటున్నారు.మిస్టర్ మజ్ను ఫలితం బయటకు రాగానే అఖిల్ కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన తదుపరి చిత్రం పై ప్లానింగ్స్ మొదలెట్టాడు.కొన్ని రోజులు మలుపు సినిమా ఫేమ్ సత్య దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడని,శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి,అయితే ప్రస్తుతం వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేయోచ్చు.

అఖిల్ తన నాల్గవ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్నాడు.
బొమ్మరిల్లు లాంటి క్లాసికల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ‘బొమ్మరిల్లు భాస్కర్ ‘.ఆ తర్వాత పరుగు సినిమాతో ఓ హిట్ కొట్టిన ఆరెంజ్ సినిమాతో ఇండస్ట్రీలో అడ్రెస్ లేకుండా పోయారు. ఆరెంజ్ సినిమా తర్వాత రామ్ తో చేసిన ఒంగోలు గిత్త కూడా భాస్కర్ ని డైరెక్టర్ గా నిలబెట్టలేకపోయింది.మళ్ళీ దాదాపు ఏడు సంవత్సరాల తరువాత ఇప్పుడు మరో చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు.గీతా ఆర్ట్స్‌ 2 సంస్థలో ఈ సినిమా ఉండబోతుంది, సమ్మర్ మధ్యలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ప్రస్తుతం భాస్కర్ స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడు,స్క్రిప్ట్ కూడా చివరి దశలో ఉందని అదికూడా బొమ్మరిల్లు లాంటి కుటుంబ తరహా కథే అని సమాచారం. ఏదేమైనా ఇటు అఖిల్ కి డైరెక్టర్ భాస్కర్ కి ఈ సినిమా వాళ్ళ వాళ్ళ కెరీర్‌లో అత్యంత కీలకం అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో అఖిల్ కు జోడిగా ఇటీవలే టాక్సీ వాలా సినిమాతో పరిచయం అయిన అనంతపురం ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ నటించబోతుందనీ సమాచారం.బన్నీవాసు నిర్మించనున్న ఈ సినిమా పై మరిన్నీ వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: