
అర్థ శతదినోత్సవం పూర్తి చేసుకున్న F2..!
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన మల్టీస్టారర్ ‘F2’ , సంక్రాంతి బరిలో దిగి ఘనవిజయం సాధించింది.అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.మూడో వారంలోనే 100 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.ఇక ఈరోజు తో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది,106 సెంటర్స్ లో అర్థ శతదినోత్సవం జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికీ పలు సెంటర్స్ లో మంచి కలెక్షన్లను రాబడుతూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నది.సంక్రాంతి తర్వాత సరైన సినిమా విడుదల కాకపోవడం F2 కి బాగా కలిసొచ్చిందని చెప్పొచ్చు.ఇక ఈ మధ్య ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సీక్వెల్ గా ‘ F3 ‘ చేస్తామని దర్శకుడు అనిల్ రావిపూడి హింట్ ఇచ్చారు,దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా , మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు.