
మహేష్ వదులుకున్న సినిమా అల్లు అర్జున్ తో..?
టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందన్న విషయం తెలిసిందే.మైత్రీ మూవీ మేకర్స్ లో ఈ సినిమా తెరకెక్కాల్సింది,కానీ ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయింది.సుకుమార్ గారితో తన సినిమా లేదని మహేష్ బాబు యే ట్విట్టర్ ద్వారా అఫీషియల్ గా చెప్పారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నా సినిమా లేదని,తను చేయబోయే కొత్త సినిమాకి నా శుభాకాంక్షలు అని చెప్పారు. అలాగే మా ఇద్దరీ కలయికలో వచ్చిన క్లాసిక్ నేనొక్కడినే సినిమా చాలా ప్రత్యేకమైనది, ఆ సినిమా చేసిన ప్రతి క్షణం చాలా ఎంజాయి చేశాను అన్నారు.ఇదే కథతో అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నారు సుకుమార్, అఫీషియల్ గా పోస్టర్ రూపంలో మైత్రీ మూవీస్ వారు ప్రకటించారు.

ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమాతో బిజీగా ఉన్నారు, ఈ సినిమా తుదిదశలో ఉంది.ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరితో చేస్తారని అప్పుడే అభిమానుల్లో ఆలోచనలు మొదలైయ్యాయి.సుకుమార్ తర్వాత తన 27 వ సినిమా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తో ఉంటుందని గతంలో వినబడింది,అయితే ఇప్పుడు సందీప్ హిందీ అర్జున్ రెడ్డి రీమేక్ చేస్తున్నారు. ఇప్పట్లో వీళ్ళ సినిమా పట్టాలెక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
అయితే ప్రస్తుతం మహేష్ బాబు తన తర్వాతి సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉండనుందని సమాచారం. ఈ సంవత్సరం F2 తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోని ఫుల్ జోష్ లో ఉన్నారు అనిల్ రావిపూడి.ఇటీవలే మహేష్ ని కలిసి కథ చెప్పినట్లు సమాచారం,అన్నీ కుదిరితే మహర్షి సినిమా తర్వాత ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం ఉంది.