మహర్షి విడుదల తేదీ పై ఓ క్లారిటీ వచ్చింది..!

మహేష్ బాబు,వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘మహర్షి ‘,ఇది అందరికీ తెలిసిన విషయమే.ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే ఏప్రిల్ 5 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు, అయితే ఇటీవలే సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టమే అని సినీ వర్గాలు చెప్పాయి.ఈరోజు మధ్యాహ్నం వరకు సినిమా విడుదల విషయమై సోషల్ మీడియా లో ఓ సంచలనం అయింది. ఇప్పుడు దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు,ప్రపంచ వ్యాప్తంగా మే 9న బ్రహ్మాండంగా విడుదల కానుంది.దిల్ రాజు మాట్లాడుతూ, ‘ ఏప్రిల్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేద్దాం అని ఇంతకుముందే చెప్పాం,ఆ తర్వాత మళ్ళీ షెడ్యూల్ ఆలస్యం కారణంగా ఏప్రిల్ 25 అనుకున్నాం కానీ మార్చి 17 వరకు ఈ సినిమా టాకీ పార్ట్ అంత పూర్తి అవుతుంది. ఇక రెండు పాటలు మిగులుతాయి, అవి కూడా సెట్స్ సాంగ్స్ మిగిలిన చిన్న షెడ్యూల్ అబు దాబిలో చిత్రీకరణ ఉంటుంది కాబట్టి ఏప్రిల్ 12 వరకు ఈ షెడ్యూల్స్ ఉంటాయి.అలాగే సినిమా ఆలస్యానికి కారణం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ సినిమా చాలా బాగా వస్తుంది, ప్రేక్షకులకి మంచి సినిమా ఇవ్వాలనే ఈ వర్క్ విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నాం. వంశీ పైడిపల్లి కెరీర్‌లోనే ఇది బెస్ట్ సినిమా అవుతుంది, తప్పకుండా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పారు.మే 9 అశ్విని దత్తు గారికి చాలా ప్రత్యేకమైనది అలాగే మే నెల మా సంస్థ కి కూడా చాలా ప్రత్యేకమైనది ‘ అని మీడియా తో చెప్పారు. ఇక మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుండగా ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు,దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని అశ్వినిదత్, దిల్ రాజు,పి.వి.పి వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: