ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ విశేషాలు…!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరులు రాజమౌళి గారి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో భారీ షెడ్యూల్ కలకత్తాలో జరగనుంది, ఇక ఈ సినిమా విషయమై చిత్ర బృందం ఈరోజు హైదరాబాదులోని పార్క్ హయాత్ లో ప్రెస్ మీట్ పెట్టారు.ఈ సమావేశానికి ముఖ్య కారణం గత కొంతకాలంగా ఈ సినిమా యొక్క వివరాలు అధికారికంగా తెలియకపోవడమే,ఏదీ ఉన్న సోషల్ మీడియాలో వచ్చే గాలి వార్తలతోనే సరిపోయేది కాబట్టి అధికారికంగా మీడియా ముందు సమావేశమై పూర్తి వివరాలు ఇచ్చేశారు.
ఈ సందర్భంగా రాజమౌళి గారు మాట్లాడుతూ ” ఈ సినిమా స్వాతంత్ర్య సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతుంది,అలాగే ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్,కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.ఇంక సినిమాలో మరో కీలక పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు,హీరోయిన్ల విషయానికొస్తే చరణ్ కి జోడిగా ఆలియా భట్,ఎన్టీఆర్ కి జోడిగా హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్ ” లను ఖరారు చేశాం అన్నారు.


మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ ఈ సినిమాలో చేసి ఉండకపోతే వాళ్ళ స్థానంలో ఎవరూ నటించేవారు అడగగా,వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు చేయకపోయిన అసలు ఈ‌ సినిమానే చేసే వాళ్ళం కాదు వేరే ఇంకేదైనా స్టోరితో నా సినిమా ఉండేదని చెప్పుకొచ్చారు.
ఇక నిర్మాత డి.వి.వి దానయ్య మాట్లాడుతూ ‘ హై టెక్నికల్ నిర్మాణపు విలువలతో దాదాపు 350 కోట్ల నుండి 400 కోట్లతో నిర్మిస్తున్నామని అన్నారు, అలాగే సినిమా విడుదల తేదీ పై కూడా స్పష్టత ఇచ్చారు.2020 లో జులై 30 న తెలుగు,తమిళ, హిందీ, మలయాళ భాషలతో పాటు దాదాపు అన్నీ భాషల్లో బ్రహ్మండంగా విడుదల కానుంది ‘ అని చెప్పారు.
ఇక ఈ సినిమాకు ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తుండగా, సుద్దాల అశోక్ తేజ గారు సాహిత్యం సమకూర్చుతున్నారు,ఎప్పటిలాగే యం.యం కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: