ఎన్నికల హామీ నెరవేర్చిన ఏపీ సీఎం జగన్..

ఎన్నికల హామీల్లో చెప్పిన మహిళలకు ఆర్థిక చేయత ఇచ్చే వైఎస్సార్ ఆసరా పథకాన్నీ ఏపీ సీఎం జగన్ నేడు తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘వైఎస్సార్‌ ఆసరా పథకం’ ద్వారా 87.75 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు.

మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ. 27,168.83 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతలలో జమచేయనుంది. తొలివిడత రూ.6,792.20 కోట్లను నేడు డ్వాక్రా సంఘాల ఖాతాల్లో జమ చేశారు. ఆ డబ్బును పాత అప్పులకు మినహాయించుకోకూడదని ప్రభుత్వం బ్యాంకర్లను కోరింది. అర్హత ఉన్న, జాబితాల్లో పేర్లు లేని సంఘాలు వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: