కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చేనా?

కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి ఈటెల రాజేందర్ మండలి సమావేశం లో వివరించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యం కోసం చేస్తున్నటువంటి ఖర్చు ఇప్పటికే చాలా ఎక్కువ అయిందని అన్నారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది చేస్తున్న కృషిని కొనిఆడారు. వారి కృషికి ఎంత ఇచ్చిన తక్కువే అవుతుంది అని మంత్రి సమావేశం లో తెలిపారు.

రాబోయే రోజుల్లో ప్రజారోగ్యానికి మరింత ప్రాధాన్యత పెంచనున్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలో విధంగా మన రాష్ట్రం లో కూడా కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ లో చేర్చే విషయం పై చర్చిస్తున్నామని అన్నారు. దీని పై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. అందరు తప్పకుండ జాగ్రత్త వహించాలని, ఏదైనా లక్షణాలు ఉంటె వెంటనే చికిత్స పొందాలని, తీవ్రత పెరిగితే బాధితులను రక్షించడం కష్టమని అన్నారు. ప్రజలు ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు పాటించడం వలన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణాలో మరణాల సంఖ్య చాలా తక్కువ అని అన్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: