పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టిన “సోలో బ్రతుకే సో బెటర్”.!

చిత్ర లహరి, ప్రతిరోజూ పండగే తర్వాత హ్యాట్రిక్ విజయం కోసం తాను నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్” లొక్డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోయి, మళ్ళి ఈ మధ్యనే స్టార్ట్ చేసి ఈరోజుతో పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే టీజర్ మరియు పాటలు మంచి పాజిటివ్ రెస్పాన్స్ శ్రోతలనుంచి పొందాయి.

ఇంకా ఈరోజు నుంచి ఇతర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను మొదలు పెట్టినట్టుగా అధికారికంగా సాయి ధరమ్ తేజ్ తన ట్విట్టర్ అకౌంట్లో తెలియజేసారు. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అంతా సరదా సరదాగా పూర్తయ్యిందని తమ యూనిట్ ఫోటో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

సుబ్బు డెబ్యూ దర్శకునిగా పరిచయం కానుండగా నభా నటేష్ ఈ చిత్రంలో హీరోయిన్. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: