ప్రతిదీ గేమ్ అంటున్న నోయల్, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అంటున్న దివి

మొదలై పట్టుమని ఆరు రోజులు కాలేదు కానీ లోపల రచ్చ మొదలయింది. ఎవరబ్బా వీళ్లంతా అనుకునేలోపేయ్ వల్ల అరాచకం చూపెట్టడం, గేమ్ లో వేడి పెంచి ఆడియన్స్ కి కాస్త నవ్వు, మరి కాస్త చిరాకును తెచ్చి పెడుతుంది బిగ్ బాస్ రియాలిటీ షో. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ప్రతి సీజన్ లో లాగానే షో ని బాగా అర్ధం చేసుకొన్న ఒక ఇంటరెస్టింగ్ క్యారెక్టర్ హౌస్లో ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేసింది.

అతనే థర్డ్ సీజన్ విన్నర్ రాహుల్ ఫ్రెండ్ నోయల్. తాను రాహుల్ దగ్గరి నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ తీస్కొని అవసరానికి ఎక్కువ ఇప్పుడే గేమ్ ఆడటం మొదలెట్టాడు. షో లో ప్రతి దాన్ని గేమ్ అని ఫీల్ అయి అందర్నీ నమ్మించి చాలా తెలివిగా ఆట ఆడుతున్నాడు. ఈ కన్‍ఫ్యూజన్‍లో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిలో లాస్య, కళ్యాణి, అభిజీత్‍, హారిక లాంటి వాళ్లు వెర్రి వాళ్ళు అయ్యారు.

ఇదంతా నాణానికి ఒక వైపు ఐతే కుర్రాళ్ళ గుండెల్ని పిండేసి మొదట కెమెరాస్ కి దొరక కుండా రెండు రోజులు సైలెంట్ గా ఉన్న దివి తాను అన్ని గమనిస్తున్నామని, తనని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంత ఈజీ కాదని తన పైన ఆశలు పెట్టుకున్న కుర్రాళ్ళ గుండెల్లో కాస్త గట్టిగానే స్థానం సంపాదించుకుంది అని చెప్పొచ్చు.

ఎలాగైతేనేం ప్రేక్షకులు కోరుకునేది మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్. అది మాత్రం తగ్గకుండా చూసుకుంటారని కోరుకుందాం. మరి ఈ వారం ఎవరు ఇల్లు విడిచి బయటికి వెళ్తారో చూద్దాం.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: