
బిగ్ బాస్ 4 లో కీలక మార్పులు జరగబోతున్నాయి
వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ 4 వ సీసన్ మొదలయి 5 రోజులు కావస్తుంది, కానీ ఇంతకు ముందు సీసన్లకి ఉన్నంత క్రేజ్ దీనికి రాలేదనే చెప్పాలి. మొదటి రోజు కంటెస్టెంట్ లని చూసి ప్రేక్షకులు నిరాశ చెందారు. ఆ తర్వాత గేమ్ షోలో అంతగా ఆకట్టుకునే ప్రతిభ వారిలో లేకపోవడమే కారణం అని గట్టిగ వినిపిస్తుంది.

ఇదిలాగే సాగితే రాబోయే ఎపిసోడ్స్ కి ఇప్పుడు చూస్తున్న కాస్తమంది ప్రేక్షకులు కూడా చూడటం మానేస్తారేమోనని యాజమాన్యం అందుకు తగ్గ మార్పులు చేర్పులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. త్వరలోనే కొందరు పెద్ద సెలెబ్రిటీలని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపిస్తున్నారని సమాచారం. మరియు వారాంతంలో కొంతమంది ఆసక్తికరమైన సెలెబ్రిటీలను పిలిచి ఇంటరాక్ట్ చేయబోతున్నారట. మరి ఏది ఎలాగా వర్క్ అవుట్ బుద్ధో వేచి చూడాల్సిందే. అల్ ది బెస్ట్ బిగ్ బాస్ 4 టీం.