
‘వి’ ఫర్ విక్టరీ
ప్రతిష్టాత్మక నాని 25 వ చిత్రం ‘వి’ ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయి మిశ్రమ టాక్ అందుకుంది. కాగా కరోనా కారణంగా థియేటర్స్ మూత పడటంతో నిర్మాతల పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. ఆదాల ఉన్నప్పటికీ ‘వి’ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాత్రం ఓ టి టి లో సినిమా రిలీజ్ చేసి పది కోట్లు వెనకేసుకున్నాడట. ఈ చిత్రానికి మొత్తంగా ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెడితే, డిజిటల్, శాటిలైట్, హిందీ దుబ్బింగ్ రైట్స్ కి మొత్తంగానూ నలభై ఆరు కోట్లు వచ్చాయట.

ఒక వైపు పది కోట్ల లాభంతో పటు డిజిటల్ రిలీజ్ వల్ల ప్రింట్, పబ్లిసిటీ ఖర్చులన్నీ మిగిలాయి. పైగా బయ్యర్ల టెన్షన్ లేదు. సినిమా మిశ్రమ స్పందన వచ్చినందున ఒక వేళా థియేటర్ లో రిలీజ్ అయుంటే బయర్లకే తిరిగి కొంత చెల్లించాల్సి వచ్చేది అని విశ్లేషకులు అంటున్నారు.
ఇలాగె రిలీస్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేసే యోచనలో ఉన్నాయని సమాచారం.