
అయిదు నెలల గ్యాప్ తర్వాత అరిపిస్తున్న కోహ్లీ
ఇంతవరకు ఐపిఎల్ టైటిల్ ని ఒక్కసారి కూడా గెలవలేదన్న కసితో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి మంచి జోష్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాడు. కేవలం ఒకేసారి వీరు ఫైనల్ పోరు వరకు వెళ్లారు 2016 సీజన్లో, ఆలా అని చెప్పి టీం వీక్ అనుకునేరు, చాలా పెద్ద దిగ్గజ క్రికెటర్లు ఉన్న టీం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఎప్పటికప్పుడు ట్రోల్ల్స్ లో ట్రెండింగ్‌లో ఉండే టీం, ఈసారి మాత్రం చాలా కసిగా కప్పు కొట్టే దిశగా వెళ్తుందని కోహ్లీ ప్రాక్టీస్ చెప్పకనే చెప్తుంది.
అయిదు నెలల గ్యాప్ తర్వాత ప్రాక్టీస్ కాస్త భారంగా అనిపించినా, ఇప్పుడు టీం పూర్తి ఫామ్‌లోకి రావడం ఆనందాన్నిచ్చింది అని ఆర్సీబీ ట్వీటర్లో కోహ్లి మాట్లాడుతూ చెప్పాడు. ఈ నెల 21వ తేదీన ఆర్సీబీ తన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.