ఇంత క్యూట్ నెస్ వెనకాల అంత పెద్ద రహస్యమా?

సుశాంత్ సింగ్ రాజపుత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొని, ఆ తర్వాత డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వారు రియా చక్రవర్తి ని అరెస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. దీనికి సంబంధించి అన్ని మీడియాలలో చాల హాట్ హాట్ డిస్కషన్స్ మరియు న్యూస్ వస్తున్నాయి. తాను డ్రగ్స్ వాడేదాన్నని, సుశాంత్ కూడా డ్రగ్ అడిక్టే అని రియా ఎన్సీబీ విచారణలో ఒప్పుకున్నట్లు, సుశాంత్, రియాలకు ఆమె సోదరుడే డ్రగ్స్ సరఫరా చేసేవాడని వార్తలొచ్చాయి. అతణ్ని సైతం అరెస్ట్ చేసింది ఎన్సీబీ. వీళ్ళ బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసినట్టు సమాచారం. ఇంతలో విచారణలో రియా కొన్ని సంచలన నిజాలు చెప్పినట్లుగా టైమ్స్ నౌ ఛానెల్ ఒక సెన్సేషనల్ స్టోరీ ప్రసారం చేసింది.

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు, ఇప్పుడు బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకునేదని రియా ఎన్సీబీ విచారణలో చెప్పినట్లు ఈ ఛానెల్ వెల్లడించింది. రకుల్‌తో పాటు సుశాంత్‌తో ‘కేదార్‌నాథ్’ సినిమాలో నటించిన సైఫ్ అలీఖాన్ తనయురాలు సారా అలీ ఖాన్ సైతం మాదక ద్రవ్యాలు తీసుకునేదని ఆమె పేర్కొందట. దీనికి సంబంధించిన టైమ్స్ నౌ స్క్రోలింగ్స్ ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి. ఇది రకుల్, సారాలకు ఇబ్బంది కలిగించే విషయమే. టాలీవుడ్లో ఒకప్పుడు జరిగినట్లే ఇప్పుడు బాలీవుడ్లో పలువురికి నోటీసులు పంపబోతున్నట్లు, వారిని విచారణకు పిలిచి డ్రగ్ టెస్టులు కూడా చేయబోతున్నారని అక్కడి మీడియా వర్గాలంటున్నాయి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: