ఎం చేసిన కుర్రకారు కోసమే..

యువత అంటేనే ఒక కొత్త ఎనర్జీ, ఎంతో ఆహ్లాదం ఉంటుంది అలాంటిది యువత ని టార్గెట్ చేస్తూ వారిని అలరించడానికి ముందుకు వస్తున్నా ఎంటర్టైన్మెంట్ ఛానల్ అంటే ఎలా ఉంటుంది. సో యువత కోసం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే లక్ష్యంగా సర్వ సన్నాహాలు చేసుకుంటున్న ‘స్టూడియో యువ’ ఛానల్ కుర్రకారు కోరుకునే వినోదంతోపాటు విజ్ఞానం మరియు మానసిక వికాసంకు దోహదపడే విధంగా ఉంటుందని ఆ మేరకు తమ ఛానల్ ను ప్రత్యేక శ్రద్ధతో తీర్చి దిద్దుతున్నామని ‘స్టూడియా యువ’ యాజమాన్యం చెబుతోంది.

ఇప్పటికే ఎన్నో చానెల్స్ ఉన్నాయి కానీ యువత కోసం తెలుగులో ఒక్కటి కూడా లేదు. దానినే ఈ ఛానల్ వారు చాలా శ్రద్ధతో యూవతకు ఎంతో ఉపయోగ పడే అనేక ప్రోగ్రామ్స్ ని ముందుకు తెస్తున్నారు. ఈ విజయదశమి పర్వదినం రోజున ప్రసారాలు ప్రారంభించాలానే ఆలోచనలో ‘స్టూడియో యువ’ ఉన్నట్టు సమాచారం. అన్ని ముఖ్య సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఈ ఛానల్ లభ్యం కానుంది. ఇప్పటివరకు మన తెలుగులో యువతరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ ఛానల్ రాలేదని, ‘స్టూడియో యువ’లో ప్రసరమయ్యే ప్రతి ప్రోగ్రాం యూత్ ని విశేషంగా అలరిస్తుందని ‘స్టూడియో యువ’ ప్రతినిధి అంటున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: