
ఓటిటి రిలీజే సో బెటర్..!
జీ 5 లో విడుదలకి సన్నాహాలు చేస్కుంటున్నా ‘సోలో బ్రతుకే సో బెటర్ ‘ టీం. యిప్పటికీ జీ టీం అక్టోబర్ కల్లా ఫైనల్ కంటెంట్ ఇవ్వాల్సి ఉంటుందని షరతులు పెట్టిందని, దానికోసమే చిత్ర యూనిట్ త్వర త్వరగా కరోనాని కూడా లెక్క చేయకుండా ఈ మధ్యనే మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓటిటి రిలీజ్ కాబట్టి రెండు పాటలు షూట్ చేయలేదని సమాచారం. తర్వాత ఎమన్నా యు ట్యూబ్ లో చేస్తారేమో అని వేచి చూడాల్సిందే.

చిత్రం రిలీజ్ సంగతి ఇంతవరకు అధికార ప్రకటన ఏది లేదు. జీ 5 కూడా డిజిటల్ రిలీజ్ గురించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ బయట పెట్టలేదు. ఏదేమైనప్పటికీ సినిమా ప్రియులకి మాత్రం ఇది ఊరట కలిగించే విషయమే.