ఓటిటి లో రాజ్ తరుణ్ ఫస్ట్ హిట్ కొడతాడా..?

లాక్ డౌన్ వల్ల మూతపడిన థియేటర్లు ఇప్పటి వరకు తెరుచుకోలేదు ఇప్పట్లో తెరుచుకునే ప్రసక్తి కూడా కనిపించట్లేదు.దీని ప్రభావం వల్ల విడుదలకి సిద్ధంగా ఉన్న భారీ బడ్జెట్ ఇంక చిన్న బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి‌.ఇప్పటి వరకు తెలుగు లో పెంగ్వీన్,47 డేస్,ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, ‘ V ‘ విడుదలైయ్యాయి, అయితే వీటిలో ఏ ఒక్కటి కూడా చెప్పుకునే స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి.గతవారం విడుదలైన ‘ V ‘ సినిమా పై అన్నీ వర్గాల ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉండగా ఈ సినిమా మిశ్రమ స్పందనతో ఆ అంచనాలను అందుకోలేకపోయింది.

ఇక తరువాత విడుదలైయ్యే సినిమాల్లో రాజ్ తరుణ్ నటించిన ‘ఓరేయ్ బుజ్జిగా’ , సూర్య నటిస్తున్న ‘ఆకాశమే నీ హద్దురా’ ఉన్నాయి.వీటిలో ‘ఓరేయ్ బుజ్జిగా’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న తెలుగు మాధ్యమం ‘ఆహా’ లో విడుదల కాబోతుంది. ‘గుండె జారిగల్లంతైయ్యిందే’ ఫేమ్ విజయ్ కుమార్ కొండా ఈ చిత్రానికి దర్శకుడు, ఆహ్లాదకరమైన కామెడీతో సహా మంచి ప్రేమకథని నడిపించడం అతని ప్రత్యేకత.ఏమాత్రం మంచి టాక్ వచ్చిన ‘ఓరేయ్ బుజ్జిగా’ తో రాజ్ తరుణ్ యే ఓటిటి లో అందరికంటే ముందు ఫస్ట్ హిట్ అందుకోవడం ఖాయం.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: